ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రవికుమార్ దర్శకత్వంలో నాగచైతన్య

Sat, Dec 31, 2011
       ఆమధ్య అక్కినేని నాగ చైతన్యతో '100%లవ్' చిత్రాన్ని నిర్మించిన అల్లు అర్జున్ సన్నిహితుడు బన్నీ వాసు త్వరలో మరో చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందులో కూడా నాగ చైతన్య హీరోగా నటిస్తాడని తెలుస్తోంది. దీనికి రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తాడట. రవికుమార్ గతంలో గోపీచంద్ తో 'యజ్ఞం', బాలకృష్ణతో 'వీరభద్ర' వంటి సినిమాలు రూపొందించాడు. రవికుమార్ చెప్పిన కథ నాగచైతన్యకు బాగా నచ్చిందట. దాంతో చేయడానికి అంగీకరించాడని అంటున్నారు. వచ్చే ఫిబ్రవరి నుంచి ఈ చిత్రం షూటింగు మొదలవుతుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి. ఇదిలా ఉంచితే, నాగ చైతన్య ప్రస్తుతం దేవా కట్టా దర్శకత్వంలో 'ఆటో నగర్ సూర్య' సినిమాలో నటిస్తుండగా, రాధామోహన్ దర్శకత్వంలో రూపొందే 'గౌరవం' సినిమా ప్రారంభం కావాల్సి వుంది.
X

Feedback Form

Your IP address: 54.163.94.5
Movie News (Latest)