ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మల్టీస్టారర్ చిత్రంలో సమంతా లేదా?

Fri, Dec 30, 2011
       దిల్ రాజు ఏ ముహూర్తాన మల్టీ స్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టాడో కానీ మొదటి నుంచీ దానికి అన్నీ సమస్యలే. చాంతాడంత టైటిల్ తో ప్రారంభించిన ఈ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో మొదట్లో పవన్ కల్యాణ్ నటిస్తానని చెప్పి చివరి నిమిషంలో తప్పుకున్నాడు. ఆ తర్వాత మహేష్ ఇందులోకి వచ్చాడు. తర్వాత వెంకటేష్ పక్కన కథానాయిక ఎంపిక పెద్ద తలనొప్పి అయిపోయింది. మహేష్ కి వదిన పాత్ర అనగానే నటించడానికి ఏ అమ్మాయీ ముందుకు రాలేదు. చివరికి అమలాపాల్ సెలెక్ట్ అయిందన్నారు.

      నిర్మాత కాస్త ఊపిరి పీల్చుకునేలోపులో, మహేష్ కి జంటగా బుక్ చేసిన సమంతా డేట్స్ సమస్యలో చిక్కుకుపోయింది. దాంతో, ఈ నెలలో మొదలవ్వాల్సిన షూటింగు కాస్తా వచ్చే నెలకి వాయిదా వేసుకున్నారు. అయితే, ఇలా ఓ హీరోయిన్ కోసం వాయిదా వేసుకోవడం వల్ల ముందు ముందు మరింత ఇబ్బంది ఎదురవుతుందేమో అన్న మీమాంసలో దర్శక నిర్మాతలున్నట్టు తెలుస్తోంది. సమంతా ఎడాపెడా సినిమాలు ఒప్పేసుకోవడం వల్ల మరోసారి కూడా డేట్స్ ప్రాబ్లం రావచ్చన్నది వాళ్ల అంచనా. అందుకని, ఆమెను డ్రాప్ చేసుకోవాలన్న ఉద్దేశంలో నిర్మాత వున్నట్టు చెబుతున్నారు. ఆమె స్థానంలో మరో కథానాయికను ట్రై చేస్తున్నారన్నది తాజా సమాచారం!
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)