ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'పంజా' నిర్మాతలకు పవన్ మరో చాన్స్!

Wed, Dec 28, 2011
      'తీన్ మార్' సినిమా బాక్సాఫీసు వద్ద నిరాశపరచడంతో హీరో పవన్ కల్యాణ్ ఆ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ కి వెంటనే మరో సినిమా (గబ్బర్ సింగ్) చేస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా ఇటీవల రిలీజ్ అయిన 'పంజా' సినిమా కూడా ప్రేక్షకాదరణ పొందకపోవడంతో, ఆ నిర్మాతలకు కూడా మరో సినిమా చేస్తానని పవన్ మాటిచ్చాడట. ఆ చిత్రానికి 'జల్సా' దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని డైరెక్టర్ గా పెట్టినట్టు కూడా టాలీవుడ్ లో వినిపిస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చేస్తున్న చిత్రం పూర్తయ్యాక, మరోపక్క ప్రస్తుతం తాను చేస్తున్న 'గబ్బర్ సింగ్' పూర్తయ్యాక ఈ చిత్రం మొదలవ్వచ్చని తెలుస్తోంది. ఈ అనుకోని, వూహించని ఆఫర్ తో 'పంజా' నిర్మాతలు తిరుమలశెట్టి నీలిమ, యార్లగడ్డ శోభు చాలా చాలా హ్యాపీగా ఉన్నారట!
X

Feedback Form

Your IP address: 54.166.5.76
Movie News (Latest)