ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

భారవి 'ఆదిశంకర'లో మోహన్ బాబు

Wed, Dec 28, 2011
      ప్రముఖ రచయిత జె.కె.భారవి దర్శకత్వంలో రూపొందుతున్న 'జగద్గురు ఆదిశంకర' చిత్రంలో ప్రముఖ నటుడు మోహన్ బాబు ఓ ప్రత్యేక పాత్ర పోషించడానికి అంగీకరించారు. ఇప్పటికే ఇందులో ఓ ముఖ్య పాత్ర పోషించడానికి అక్కినేని నాగార్జున కూడా అంగీకరించిన సంగతి మనకు తెలుసు. కౌశిక్ బాబు ఆదిశంకరుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో జయప్రద, ప్రకాష్ రాజ్ జంటగా నటిస్తున్నారు. మరో ప్రముఖ హీరోని కూడా ఇందులో నటింపజేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

      ఇక షూటింగు విషయానికొస్తే, అరవై శాతం పూర్తయిందని చిత్రం యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. పదహారు మంది గాయకులు పాడిన తొమ్మిది పాటల చిత్రీకరణ అమ్మ రాజశేఖర్ నృత్య సారధ్యంలో జరిగింది. అరవై నిమిషాలకు పైగా వుండే గ్రాఫిక్స్ వర్క్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఉగాదికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్న ఈ చిత్రానికి నాగ్ శ్రీవత్స సంగీతం సమకూరుస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Movie News (Latest)