ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మాతృభాషలో రిచా సినిమా

Tue, Dec 27, 2011
        కాస్త లేట్ అయినా బెంగాలీ పిల్ల రిచా గంగోపాద్యాయ సినిమా కెరీర్ ఇప్పుడు ఊపందుకుంది. పలు భాషల నుంచి ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ తో 'వారధి', వెంకటేష్ తో మెహర్ రమేష్ సినిమా చేస్తున్న రిచా, అటు తమిళంలో కూడా బిజీగానే వుంది. ఇటీవలే శింబుతో ఓ సినిమా, ధనుష్ తో మరో సినిమా చేసింది. మరి కొన్ని తమిళ ప్రాజక్టులు కూడా ఆమె చేతిలో వున్నాయి. అలాగే ఓ బాలీవుడ్ చిత్రాన్ని కూడా కమిట్ అయింది. విశేషమేమిటంటే, తాజాగా తన మాతృభాష బెంగాలీలో కూడా ఓ సినిమా ఒప్పుకుందట. తెలుగులో హిట్టయిన 'విక్రమార్కుడు' చిత్రానికి ఇది రీమేక్ అని తెలుస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్ లతో పోల్చుకుంటే, బెంగాలీ సినిమా మార్కెట్ చిన్నది. తారలకు ఇక్కడ ఇచ్చేటంతటి పారితోషికాలు అక్కడ ఇవ్వరు. అందుకని రిచా తన మాతృభాషలో ఓ సినిమా చేసి, మళ్లీ ఇక్కడికి వచ్చేస్తుందనే అనుకోవాలి! 
X

Feedback Form

Your IP address: 54.158.173.184
Movie News (Latest)