ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మణిరత్నం సినిమాలో బహుభాషా నటులు

Tue, Dec 27, 2011
         ఎన్ని ఫ్లాపులిచ్చినా కూడా మణిరత్నం ఓ సినిమా రూపొందిస్తున్నాడంటే ఆ సినిమాకుండే గ్లామరే వేరు. మీడియాతో బాటు సినిమా ఇండస్ట్రీ కూడా ఆ ప్రాజక్టు పట్ల ఎంతో ఆసక్తి చూపుతుంది. ప్రస్తుతం ఆయన డైరెక్ట్ చేస్తున్న త్రిభాషా ప్రేమ కథా చిత్రం (తమిళంలో పూక్కడై) కూడా అలాగే అందర్నీ ఆకర్షిస్తోంది. ఇందులో నిన్నటి తరం కథానాయకుడు కార్తీక్ తనయుడు గౌతమ్ హీరోగా నటిస్తుండగా, బాలీవుడ్ నటి సోనం కపూర్ కథానాయికగా నటిస్తుందని వార్తలొచ్చాయి. మరోపక్క ఈ సినిమాలో మణిరత్నం అన్ని భాషలకు చెందిన నటుల్నీ తీసుకుంటున్నాడు. ఇప్పటికే కన్నడ నటుడు అర్జున్, తెలుగు నటి మంచు లక్ష్మి ఎంపిక కాగా, తాజాగా మలయాళ నటుడు లాల్ కూడా ఎంపికయ్యాడట. ఈ సినిమా కోసం తనని అడిగినట్టుగా లాల్ కూడా కన్ఫర్మ్ చేస్తున్నాడు. అయితే, డేట్స్ దగ్గర సమస్య వచ్చేలా ఉందనీ, అయినా ఆ సినిమా వదులుకునే ప్రసక్తే లేదనీ లాల్ అంటున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.167.142.229
Movie News (Latest)