ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఐశ్వర్య ఇప్పట్లో సినిమా చేయదా?

Mon, Dec 26, 2011
       ఐశ్వర్యా రాయ్ మళ్లీ వెండితెరపైకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇదొక శుభవార్త లాంటిదే. ఓ బిడ్డకు జన్మనిచ్చి తల్లి అయిన తర్వాత ఆమె రూపం ఎలా ఉందా అని చాలామంది ఆసక్తితో ఎదురుచూస్తున్న మాట నిజమే. వీళ్లందరి కోరికా త్వరలో తీరనుంది. అయితే, ఆమె సినిమాల్లో ఇప్పట్లో నటించడం లేదు కానీ, ఓ వ్యాపార ప్రకటనలో మాత్రం నటించబోతోంది. ఓ ప్రముఖ ఆభరణాల సంస్థకి ఆమె బ్రాండ్ అంబాసడార్ గా వ్యవహరించనుంది. ఇందుకు సంబంధించిన ఒప్పందం వచ్చే నెలలో ఖరారు కానుందని బాలీవుడ్ సమాచారం.

       తల్లినైనా కూడా తన అందచందాల వన్నెలు తగ్గలేదని నిరూపించడానికి ఆమె ఇప్పటి నుంచే చాలా జాగ్రత్తలు తీసుకుంటోందట. ఎక్సర్ సైజులతో బాటు యోగా కూడా చేస్తోంది. ఈ కమర్షియల్ లో నటించిన తర్వాతే సినిమాలలో నటించడంపై నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. ఇప్పటికే దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ స్క్రిప్టుతో రెడీగా వున్నాడు. అయితే, ఆమె ఎవరి చిత్రం ముందుగా చేస్తుందన్నది ఇంకా డిసైడ్ కాలేదు. 
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)