ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

లౌక్యం నేర్చుకున్న కథానాయిక

Sun, Dec 25, 2011
        బాలీవుడ్ తార సోనం కపూర్ ఈమధ్య గతంలోలా లేదు. అన్ని విషయాల్లోనూ కాస్త లౌక్యం నేర్చుకుంది. దీనికి కారణం... అభిషేక్ బచ్చన్ అట! అభి చెప్పిన టిప్స్ వల్లే ఇవన్నీ నేర్చుకున్నానని ఆమె చెబుతోంది. "నేను కూడా సినిమా కుటుంబం నుంచే వచ్చినప్పటికీ నాకు ఈ లౌక్యం వంటివి తెలియదు. ఏది అనిపిస్తే అది అనేస్తాను. అయితే, అభి అలా ఉండకూడదనీ, ఇక్కడ కాస్త స్మార్ట్ గా ఉండాలనీ చెప్పాడు" అంటోంది. "మామూలుగా నన్నెవరైనా బాధపెడితే అది వెంటనే నా ముఖంలో కనిపించేస్తుంది. లోపల ఏదీ దాచుకోలేను. అయితే, అదిక్కడ పనిచేయదని అభి చెప్పాడు. మనం మనసులో అనుకునేది పైకి మాట్లాడకూడదనీ, మనకు నచ్చినా నచ్చకపోయినా నవ్వుతూనే ఉండాలనీ చెప్పాడు. ఇప్పుడు అవే పాటిస్తున్నాను" అంటోంది అనిల్ కపూర్ కూతురు సోనం. 
X

Feedback Form

Your IP address: 54.167.129.169
Movie News (Latest)