ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ప్రొడక్షన్ రంగంలోకి మహేష్ బాబు?

Sun, Dec 25, 2011
        మహేష్ బాబు చిత్రనిర్మాణంలోకి దిగుతున్నాడా? ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ హాట్ గా డిస్కషన్స్ లో వున్న టాపిక్ ఇదే. మహేష్, నమ్రత దంపతులు త్వరలోనే చిత్ర నిర్మాణంలోకి ప్రవేశిస్తున్నారనీ, అందుకోసం ఓ ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభిస్తున్నారని వార్తలొస్తున్నాయి. అయితే, ముందుగా తెలుగులో కాకుండా బాలీవుడ్ లో చిత్రనిర్మాణం చేబట్టాలని యోచిస్తున్నారట. తొలి ప్రయత్నంగా మహేష్ బాబుని హిందీలో లాంచ్ చేయాలని నమ్రత ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ లాంచింగ్ గ్రాండ్ గా వుండాలని ఆమె ప్లాన్ చేస్తోందట. ఇందుకోసం బాలీవుడ్ లో తనకున్న పూర్వ పరిచయాలను ఉపయోగించుకోనుంది. బహుశా 'బిజినెస్ మేన్' చిత్రాన్ని తమ తొలి చిత్రంగా హిందీలో రీమేక్ చేయచ్చని అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికావచ్చు!
X

Feedback Form

Your IP address: 54.158.167.137
Movie News (Latest)