ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సమంతా ప్లాన్ బెడిసికొట్టింది!

Fri, Dec 23, 2011
       చెన్నయ్ అందం సమంతాకు, నిర్మాత బెల్లంకొండ సురేష్ కు ఇటీవల డేట్స్ విషయంలో ఘర్షణ జరిగి, వివాదం కాస్తా నిర్మాతల మండలి దగ్గరకెళ్ళి పరిష్కారమైన సంగతి మనకు తెలిసిందే. అయితే, సురేష్ సినిమాకు సమంతా డేట్స్ కేటాయించకపోవడం వెనుక చిన్న ఎపిసోడ్ వుందని ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. నందినీ రెడ్డి దర్శకత్వంలో సురేష్ నిర్మించే సినిమాకి సమంతా మొన్న మార్చి నెలలోనే కమిట్ అయింది. నందిని చెప్పిన కథ ఆమెకు ఎంతగానో నచ్చి చేయడానికి వెంటనే అంగీకరించింది

      అయితే, ఆ తర్వాత ఆ ప్రాజక్టులోకి హీరో సిద్ధార్థ్ ఎంటరవ్వడంతో కథ మారిపోయింది. సిద్ధూ కథలో వేలుపెట్టేసి, సమంతా పాత్ర నిడివి, ప్రాధాన్యత తగ్గించేశాడట. ఈ విషయం సన్నిహితుల ద్వారా తెలుసుకున్న సమంతా ఎలాగైనా ఈ సినిమాని వదిలించుకోవాలని ప్లాన్ వేసిందట. దాంతో, డేట్స్ ప్రాబ్లం నాటకం ఆడి, చివరికి విఫలమైంది. నిర్మాతల మండలి జోక్యంతో ఆ సినిమాకి డేట్స్ ఇవ్వక తప్పలేదు. అదీ అసలు సంగతి! 
X

Feedback Form

Your IP address: 54.204.247.205
Movie News (Latest)