ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తనికెళ్ళ భరణి మరో ప్రయత్నం

Mon, Nov 28, 2011
          రచయిత, నటుడు తనికెళ్ళ భరణి తన ఆత్మసంతృప్తి కోసం గతంలో 'గ్రహణం' చిత్రాన్ని నిర్మించారు. ప్రఖ్యాత రచయిత చలం రాసిన కథను అదే పేరుతో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఆ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఆ చిత్రానికి అవార్డులతో బాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి. ఆ స్పూర్తితో ఇప్పుడు భరణి మరో కథను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. నవ్య వీక్లీలో శ్రీరమణ రాసిన 'మైధునం'  నవలను సినిమాగా రూపొందించే పనిలో ప్రస్తుతం భరణి వున్నారు. ఓ వృద్ధ దంపతుల మధ్య ప్రేమ, శృంగారం ప్రధానంగా సాగే ఈ కథ అప్పట్లో విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ కథను తెరకెక్కించాలని భరణి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారట. ఇది కూడా అవార్డులు పొందే సినిమా అవుతుందని అంటున్నారు!    
X

Feedback Form

Your IP address: 54.166.5.76
Movie News (Latest)