ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'వాసుకి'గా నయనతార వచ్చేస్తోంది!

Fri, Apr 21, 2017
నయనతార
నయనతార
తమిళంలో వరుస సినిమాలతో నయనతార దూసుకుపోతోంది. సక్సెస్ లు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె అక్కడ 'పుదియ నియమం' అనే సినిమా చేసింది. నయనతార ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా అక్కడ మంచి ఆదరణ పొందింది. దాంతో ఈ సినిమాను 'వాసుకి' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాత మోహన్ రంగంలోకి దిగారు.

 ఈ సినిమా కథాకథనాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని ఆయన అన్నారు. నయనతార అద్భుతమైన నటన ఆడియన్స్ ను కట్టిపడేస్తుందని చెప్పారు. ఈ నెలాఖరులో సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసి, వచ్చే నెలలో విడుదల చేయనున్నామని అన్నారు. ఈ సినిమా హిట్ జాబితాలో చేరిపోవడం ఖాయమనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.   
X

Feedback Form

Your IP address: 54.196.107.247
Movie News (Latest)