ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తమన్నా పారితోషికం తగ్గించేసిందా?

Fri, Apr 21, 2017
తమన్నా
తమన్నా
తెలుగులో వరుస సినిమాలు చేస్తూ వచ్చిన తమన్నాకి చేతిలో ఇప్పుడు ఒక్కసినిమా లేదు. గతంలో తమిళ సినిమాల్లో ఛాన్సులు సంపాదించడం కోసం పారితోషికం బాగా తగ్గించేసిందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు తెలుగు సినిమాల విషయంలోను అదే టాక్ వినిపిస్తోంది. హిందీ .. తమిళ సినిమాలు కలిసిరాకపోగా, తెలుగులో ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంతో ఆమె ఆందోళన చెందుతోందట.

 తెలుగులో ఒక్క అవకాశం కూడా రాకపోవడంతో, తనకి బాగా పరిచయమున్న దర్శక నిర్మాతలకి టచ్ లోకి వెళ్లిందని అంటున్నారు. పాత్ర మంచిదైతే పారితోషికం విషయంలో పెద్ద పట్టింపు లేదంటూ, తగ్గడానికి తాను సిద్ధమేననే సంకేతాలు పంపుతోందట. ఛాన్సులు రాబట్టుకోవడం కోసం తమన్నా చేసే ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి. 
X

Feedback Form

Your IP address: 54.144.14.128
Related News
Movie News (Latest)