ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రవితేజతో తలపడనున్న బాలీవుడ్ విలన్!

Fri, Apr 21, 2017
రవితేజ
రవితేజ
ఈ మధ్య కాలంలో తెలుగు తెరపై బాలీవుడ్ విలన్స్ హవా కొనసాగుతోంది. కొత్తదనం కోసం దర్శక నిర్మాతలు బాలీవుడ్ నటులను రంగంలోకి దింపుతున్నారు. వాళ్లకి ఆదరణ కూడా ఒక రేంజ్ లో లభిస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో రవితేజ తాజా చిత్రమైన 'టచ్ చేసి చూడు' కోసం, బాలీవుడ్ నటుడైన 'ఫ్రెడ్డీ దరువాలా'ను ఎంపిక చేశారు.

 హాలీడే .. ఫోర్స్ 2  .. కమెండో 2 చిత్రాలు ఆయనకి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. ఆయనైతే ఈ పాత్రకి సరిగ్గా సరిపోతాడని భావించి ఎంపిక చేశారట. పాండిచ్చేరి నేపథ్యంలో ఈ సినిమా కొనసాగనుంది. త్వరలో విదేశాల్లోను షూటింగు జరుపనున్న ఈ సినిమాలో, కథానాయికగా రాశిఖన్నా అలరించనుంది.           
X

Feedback Form

Your IP address: 54.166.152.111
Movie News (Latest)