ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వచ్చే నెలలోనే 'రారండోయ్ వేడుక చూద్దాం'

Fri, Apr 21, 2017
రకుల్ - నాగచైతన్య
రకుల్ - నాగచైతన్య
నాగచైతన్య .. రకుల్ జంటగా నటించిన 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా, షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకి ముస్తాబవుతోంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, మే నెల 3వ వారంలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు - రకుల్ తండ్రీ కూతుళ్లుగా నటించడం విశేషం. ఈ రెండు పాత్రల మధ్య చోటుచేసుకునే సన్నివేశాలు ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంటాయని చెబుతున్నారు.

 'నిన్నే పెళ్లాడుతా' లాంటి లవ్ స్టోరీలో ఫ్యామిలీ డ్రామా వుందనీ, 'మన్మథుడు' వంటి ఫ్యామిలీ డ్రామాలో లవ్ స్టోరీ వుందని నాగ్ అన్నారు. ఆ రెండు సినిమాల తరహాలోనే ఈ సినిమా ఉంటుందని చెప్పారు. దాంతో అక్కినేని అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఈ సినిమాతో చైతూ కెరియర్లో మరో హిట్ చేరుతుందేమో చూడాలి.       
X

Feedback Form

Your IP address: 54.198.190.185
Movie News (Latest)