ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అల్లు శిరీష్ మూవీ ఫస్టులుక్!

Mon, Mar 20, 2017
అల్లు శిరీష్ తొలిసారిగా మలయాళంలో '1971 బియాండ్ ద బోర్డర్స్' అనే సినిమా చేశాడు. మోహన్ లాల్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, వార్ ట్యాంకర్ ఆపరేటర్ గా అల్లు శిరీష్ నటించాడు. తెలుగులో ఈ సినిమాకి '1971 భారత సరిహద్దు' అనే టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నారు.

 ఈ సినిమా ఫస్టులుక్ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు. యుద్ధ భూమిలో ఒక వైపున మోహన్ లాల్ .. మరో వైపున ధైర్యంగా ముందుకు దూకుతూ అల్లు శిరీష్ కనిపిస్తున్నారు. మలయాళంలో ఈ సినిమాను ఏప్రిల్ 7వ తేదీన విడుదల చేయనున్నారు. తెలుగులోను అదే రోజున రిలీజ్ చేయాలనే ఆలోచనలో వున్నారు. మలయాళం వెర్షన్ పరంగా చూస్తే, ఈ సినిమా అల్లు శిరీష్ కెరియర్ కి అక్కడ ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.      
X

Feedback Form

Your IP address: 54.156.90.21
Movie News (Latest)