ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

యంగ్ హీరోతో రంగంలోకి వినాయక్!

Mon, Mar 20, 2017
వినాయక్
వినాయక్
మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడిగా వినాయక్ కి మంచి పేరుంది. ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన 'ఖైదీ నెంబర్ 150' సినిమా ఘన విజయాన్ని అందుకుంది. దాంతో ఆయన తదుపరి సినిమా విషయం పట్ల అభిమానులు ఆసక్తిని చూపుతున్నారు.

ఈ నేపథ్యంలో గోపీచంద్ తోను .. సాయిధరమ్ తేజ్ తోను ఆయన సినిమా చేయనున్నాడంటూ ప్రచారం జరిగింది. ఆ తరువాత ఆ వార్తల్లో నిజం లేదనే సంగతి తెలిసిపోయింది. త్వరలో మంచు మనోజ్ తో కలిసి వినాయక్ సెట్స్ పైకి వెళ్లనున్నాడనేది తాజా సమాచారం. ఆల్రెడీ కథకి సంబంధించిన చర్చలు పూర్తయ్యాయనీ .. బడ్జెట్ గురించిన మాటమంతీ జరుగుతున్నాయని అంటున్నారు. అదే నిజమైతే మనోజ్ కెరియర్ కి ఈ సినిమా బాగా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. 
X

Feedback Form

Your IP address: 54.198.216.180
Movie News (Latest)