ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'బాహుబలి 2'లో పవర్ఫుల్ పాత్ర దక్కిందట!

Mon, Mar 20, 2017
సుబ్బరాజు
సుబ్బరాజు
రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా అయినా చేయాలని ఆర్టిస్టులు ఆరాటపడుతుంటారు. ఆయన సినిమాల్లో చిన్న పాత్ర దక్కినా చాలనుకుంటారు. ఎందుకంటే ఆయన సినిమాలు నటీనటులకు ఒక రేంజ్ లో పేరు ప్రతిష్ఠలు తీసుకొస్తుంటాయి. అలా 'బాహుబలి' సినిమాలో 'కాలకేయుడు' పాత్రను పోషించిన ప్రభాకర్ కి, ఆ పాత్ర తీసుకొచ్చిన పాప్యులారిటీ అంతా ఇంతా కాదు.

ఒక 'బాహుబలి 2' విషయానికి  వస్తే .. ఆ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకునే నటుడు ఎవరనే ప్రశ్న తలెత్తితే, సుబ్బరాజు పేరు ఎక్కువగా వినిపిస్తోంది. యంగ్ విలన్ గా సుబ్బరాజు పలు సినిమాల్లో మెప్పించాడు.'బాహుబలి 2' లోను ఓ పవర్ఫుల్ విలన్ పాత్రను రాజమౌళి ఆయనకి ఇచ్చాడట. ఈ సినిమా తరువాత ఆయనకి మరింత గుర్తింపు రావడం ఖాయమని చెప్పుకుంటున్నారు.   
X

Feedback Form

Your IP address: 54.145.208.160
Movie News (Latest)