ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సునీల్ 'ఫ్యాషన్ డిజైనర్' కాదు!

Thu, Sep 29, 2011
                  దర్శకుడు వంశీ గతంలో తాను రూపొందించిన 'లేడీస్ టైలర్' సినిమాకి సీక్వెల్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్న సంగతి మనకు తెలుసు. 'ఫ్యాషన్ డిజైనర్' అనే టైటిల్ తో రూపొందే ఈ చిత్రానికి 'సన్నాఫ్ లేడీస్ టైలర్' అనే ట్యాగ్ లైన్ పెడుతున్నాడు. ఇందులో హాస్యనటుడు సునీల్ కథానాయకుడుగా నటిస్తాడంటూ వార్తలొస్తున్నాయి. అయితే, దర్శకుడు దీనిని ఖండిస్తున్నాడు. ఈ టైటిల్ తో సినిమా తీస్తున్న మాట వాస్తవమేననీ, అయితే సునీల్ కానీ, అల్లరి నరేష్ కానీ ఇందులో నటించడం లేదనీ ఆయన చెబుతున్నారు. వీళ్ల కాల్షీట్లు తన దగ్గర లేవనీ, ఓ ప్రముఖ హీరో ఇందులో నటిస్తాడనీ వంశీ చెప్పారు. స్క్రిప్టు వర్క్ పూర్తయిందనీ, వచ్చే ఏడాది షూటింగు మొదలవుతుందనీ ఆయన తెలిపారు.
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)