ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆనందంతో పొంగిపోతోన్న శ్రియా శర్మ

Tue, Sep 13, 2016
శ్రియా శర్మ
శ్రియా శర్మ
బాలనటిగా పలు చిత్రాలలోను .. సీరియల్స్ లోను నటించిన శ్రియా శర్మ, 'నిర్మలా కాన్వెంట్' ద్వారా తెలుగు తెరకి పరిచయం కానుంది. టీనేజ్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా, ఈ నెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శ్రియా శర్మ మాట్లాడుతూ, ఈ సినిమాలో తన పాత్ర తనకి ఎంతో సంతృప్తిని ఇచ్చిందని చెప్పింది.

రోహన్ తన పాత్రను చాలా బాగా చేశాడని అంది. తమ ప్రేమను వ్యతిరేకించే పాత్రలో నాగార్జున కనిపిస్తారని చెప్పింది. మొదటి సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ పై చేయడం తనకి ఎంతో సంతోషాన్ని కలిగించిందని అంది. యూత్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉందని చెప్పింది. తెలుగులోని యువ అగ్రకథానాయకులందరి సరసన నటించాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టింది.
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)