ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నాగ్ మూవీపై క్రేజ్ కి అదే కారణం

Tue, Sep 13, 2016
రాఘవేంద్రరావు .. నాగార్జున కాంబినేషన్లో 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా 50 శాతానికి పైగా చిత్రీకరణ జరుపుకుంది. అనుష్క .. ప్రగ్యా జైస్వాల్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వారు ఓవర్సీస్ హక్కులను 6 కోట్లకి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

నాగార్జున వరుస సక్సెస్ లతో ఉండటం, గతంలో రాఘవేంద్రరావు కాంబినేషన్లో ఆయన చేసిన సినిమాలు ఘనవిజయాలను అందుకోవడం ఈ స్థాయి రేటు పలకడానికి కారణంగా చెప్పుకుంటున్నారు. 'హథీరామ్ బావాజీ'గా నాగార్జున లుక్ కి నూటికి నూరు మార్కులు దక్కాయి. సంగీతం పరంగా కూడా ఈ సినిమా మనసులను కట్టిపడేస్తుందనీ, కీరవాణి గొప్పతనానికి ఈ సినిమా నిలువెత్తు నిర్వచనంగా నిలుస్తుందని నాగార్జున అనడం అందరిలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)