ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నాని కోసం పాట పాడనున్న ఎన్టీఆర్

Tue, Sep 13, 2016
ఎన్టీఆర్
ఎన్టీఆర్
ఎన్టీఆర్ డైలాగ్స్ చెప్పడంలోనే కాదు .. పాటలు పాడటంలోను తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. అప్పుడప్పుడు తన సినిమాల్లో ఒక పాట పాడుతూ వస్తోన్న ఎన్టీఆర్, ఇటీవల పునీత్ రాజ్ కుమార్ కోసం ఒక కన్నడ సినిమాకి కూడా పాడాడు. ప్రస్తుతం నాని సినిమా కోసం పాడటానికి ఆయన రెడీ అవుతున్నట్టు చెబుతున్నారు.

త్రినాథరావు దర్శకత్వంలో నాని 'పక్కా లోకల్' సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. వీళ్లంతా కలిసి ఒక పాట పాడమని ఎన్టీఆర్ ను రిక్వెస్ట్ చేశారట. అంతా మంచి ఫ్రెండ్స్ కావడంతో ఎన్టీఆర్ ఓకే అనేశాడని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ పాటను రికార్డు చేయడం జరుగుతుందని అంటున్నారు. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, వచ్చే ఏడాది మొదట్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)