ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఎన్టీఆర్ 'అదుర్స్' తరహా పాత్రలో బన్నీ!

Tue, Sep 13, 2016
అల్లు అర్జున్
అల్లు అర్జున్
ఎన్టీఆర్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'అదుర్స్' ఒకటి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశాడు. 'చారి' పేరుతో పురోహితుడుగా ఆయన పోషించిన ఒక పాత్ర ఆడియన్స్ ను ఒక రేంజ్ లో అలరించింది. నామాలు ధరించి .. పిలక పెట్టుకుని .. పంచె కట్టుకుని "గురువు గారు .. గురువు గారు" అంటూ ఆయన చూపిన నటనకి మంచి మార్కులు పడ్డాయి.

ఇప్పుడు ఇదే తరహా పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడని చెప్పుకుంటున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో 'దువ్వాడ జగన్నాధం'గా అల్లు అర్జున్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఇలా విభిన్నమైన పాత్రలో నటించనున్నట్టు చెబుతున్నారు. ఈ పాత్ర కోసం బన్నీ బాగా హోమ్ వర్క్ చేస్తున్నాడని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.54.215
Movie News (Latest)