ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ తో హరీష్ శంకర్ మూవీ

Tue, Sep 13, 2016
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ .. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనున్నట్టు ఫిల్మ్ నగర్లో జోరుగా ఒక వార్త షికారు చేస్తోంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'గబ్బర్ సింగ్' సినిమా ఘన విజయాన్ని సాధించింది. అందువలన పవన్ తో మరో సినిమా చేయాలని హరీష్ శంకర్ ఎప్పటి నుంచో చెబుతున్నాడు.

ఇక పవన్ కూడా ఆయన దర్శకత్వంలో మరో మూవీ చేయాలనే ఆసక్తిని చూపుతున్నాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ ఆల్రెడీ ఒక కథను సిద్ధం చేశాడని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ 'కాటమరాయుడు' సినిమా చేస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ తో 'దువ్వాడ జగన్నాధం' సినిమాకి సంబంధించిన పనులతో హరీష్ శంకర్ బిజీగా వున్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తరువాత, వీళ్ల కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Movie News (Latest)