ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నిహారిక 'మొదటి పెళ్లి చూపులు'

Tue, Sep 13, 2016
నిహారిక మొదటి సినిమా 'ఒక మనసు' ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. అయినా నటన పరంగా నిహారికకు నూటికి నూరు మార్కులు పడిపోయాయి. దాంతో ఆమె రెండవ సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పంజాబీలో ఘన విజయాన్ని అందుకున్న ఒక సినిమా రీమేక్ లో ఆమె నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఆమె విజయ్ దేవరకొండకి జంటగా కనిపించనున్నట్టు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆమె తన సొంత బ్యానర్ పై 'మొదటి పెళ్లిచూపులు' అనే వెబ్ సిరీస్ ను నిర్మిస్తోంది. హరీష్ నాగరాజ్ ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో నిహారిక చేసిన 'ముద్దపప్పు ఆవకాయ' వెబ్ సిరీస్ నెటిజన్లను ఆకట్టుకున్నా, ఈ వెబ్ సిరీస్ లో మాత్రం నిహారిక నటించడం లేదు. నయా అనే కొత్త అమ్మాయితో ఈ వెబ్ సిరీస్ ను చేస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.211.62.139
Movie News (Latest)