ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఎన్టీఆర్ కోసం మరో డైరెక్టర్ వెయిటింగ్

Tue, Sep 13, 2016
ఎన్టీఆర్
ఎన్టీఆర్
'జనతా గ్యారేజ్' సినిమా హిట్ కొట్టడంతో ఎన్టీఆర్ మాంచి జోష్ తో వున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన ఏ దర్శకుడితో సెట్స్ పైకి వెళతాడనే విషయంలో అందరిలోను ఆసక్తి నెలకొంది. ఆల్రెడీ ఆయనకి పూరి జగన్నాథ్ ఒక కథలో కొంతభాగం చెప్పాడట. మిగతా భాగాన్ని 'ఇజం' పూర్తయిన తరువాత చెప్పనున్నాడని అంటున్నారు.

ఇక అనిల్ రావిపూడి కూడా ఎన్టీఆర్ కి ఒక కథ చెప్పాడట. ఈ కథ విషయంలో ఎన్టీఆర్ తన నిర్ణయాన్ని చెప్పవలసి వుంది. ఆ నిర్ణయం కోసం ఆయన ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి కూడా ఎన్టీఆర్ కి ఒక కథను వినిపించాడని చెబుతున్నారు. ఆయన కూడా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాడని అంటున్నారు. మరి ఈ ముగ్గురు దర్శకులలో ఎన్టీఆర్ ఎవరికి ఛాన్స్ ఇస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
X

Feedback Form

Your IP address: 54.87.119.171
Movie News (Latest)