ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అదే మోహన్ బాబు వేడుక స్పెషాలిటీ

Mon, Sep 12, 2016
మోహన్ బాబు
మోహన్ బాబు
తెలుగు తెరపై విభిన్నమైన డైలాగ్ డెలివరీకి .. విలక్షణమైన నటనకి కేరాఫ్ అడ్రెస్ గా మోహన్ బాబు గురించి చెప్పుకుంటారు. అలాంటి మోహన్ బాబు నటుడిగా 40 యేళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు .. అభిమానులు కలిసి వైజాగ్ వేదికగా ఆయనని సత్కరించనున్నారు. ఈ వేడుకను ఈ నెల 17వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంలో .. మోహన్ బాబు నటించిన హిట్ చిత్రాలలోని 60 పాటలను కలుపుకుని ఒక సీడీని రిలీజ్ చేయనున్నారు. ఇక మోహన్ బాబు కెరియర్లో కలికితురాయిగా నిలిచిపోయిన 'పెదరాయుడు' సినిమాలోని హైలైట్ సీన్స్ తో కూడిన ఒక సీడీని విడుదల చేయనున్నారు. అలాగే మోహన్ బాబు అంచలంచెలుగా ఎదిగిన తీరును తెలిపే, పర్సనల్ ఫోటోలతో కూడిన ప్రత్యేకమైన ఆల్బమ్ ను రిలీజ్ చేయనున్నారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరవుతారు.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)