ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నయన్ కి విలన్ గా టాప్ డైరెక్టర్

Mon, Sep 12, 2016
గౌతమ్ మీనన్
గౌతమ్ మీనన్
అగ్రదర్శకులు కొంతమంది నిర్మాతలుగానే కాదు, నటులుగా కూడా మారిపోతున్నారు. కొత్తదనం కోసం విలన్ గా కనిపించడానికి కూడా ఉత్సాహాన్ని చూపుతున్నారు. అలా ఎస్. జె. సూర్య తరువాత విలన్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి గౌతమ్ మీనన్ సిద్ధమవుతున్నాడు.

ప్రస్తుతం ధనుష్ తో ఒక సినిమా చేస్తోన్న గౌతమ్ మీనన్, ఆ తరువాత రజనీకాంత్ తో ఒక సినిమా చేయడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన 'ఇమైక్క నోడిగళ్' అనే చిత్రంలో విలన్ గా నటించడానికి అంగీకరించాడు. అధర్వ .. నయనతార నటిస్తోన్న ఈ సినిమాలో ఆయన ఇలా కనిపించనున్నాడు. 'డిమాంటి కాలనీ' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అజయ్, ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాలో విలన్ గా గౌతమ్ మీనన్ ఎలా మెప్పిస్తాడో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Movie News (Latest)