ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వశిష్టి దేవి లుక్ కి అనూహ్యమైన రెస్పాన్స్

Mon, Sep 12, 2016
'గౌతమీపుత్ర శాతకర్ణి' లో శ్రియ
'గౌతమీపుత్ర శాతకర్ణి' లో శ్రియ
తెలుగు తెరపై నాజూకైన కథానాయికలుగా ఒక వెలుగు వెలిగిన వారిలో, శ్రియకి ప్రత్యేకమైన స్థానం వుంది. కథానాయికగా ఆమెకి అవకాశాలు తగ్గడంతో, ముఖ్యమైన పాత్రలను పోషిస్తూ వస్తోంది. అలా ఇటీవల ఆమె నటించిన చిత్రాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలోనే ఆమె 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాలో నటిస్తోంది.

శాతకర్ణి భార్య వశిష్టి దేవి పాత్రలో ఆమె నటిస్తోంది. ఈ పాత్రకి సంబంధించిన లుక్ ను రిలీజ్ చేయగా అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. బాలయ్య ఫ్యాన్స్ బాగా షేర్ చేసుకుంటున్నారు. హేమమాలిని .. బాలకృష్ణ .. శ్రియ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకారిస్తున్నారు. శ్రియ ఈ పాత్రలో అద్భుతంగా నటిస్తోందని చెప్పుకుంటున్నారు. ఈ పాత్ర విషయంలో చాలా కసరత్తు చేసిన తరువాతనే శ్రియను క్రిష్ ఎంపిక చేశాడట. ఆమె నటన పట్ల ఆయన పూర్తి సంతృప్తితో వున్నాడని అంటున్నారు. 'బాహుబలి'లో శివగామి పాత్ర రమ్యకృష్ణకి మంచి పేరు తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. అదే విధంగా వశిష్టి దేవి పాత్ర, శ్రియ క్రేజ్ ను మరింత పెంచుతుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)