ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చరణ్ తో చిరూ మూవీ రీమేక్

Mon, Sep 12, 2016
చరణ్
చరణ్
చిరంజీవి కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'జగదేక వీరుడు అతిలోక సుందరి' ఒకటి. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా, అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. కథా కథనాల పరంగా .. సంగీతం పరంగా ఈ సినిమా అదరహో అనిపించింది. అప్పటి నుంచి ఈ సినిమా సీక్వెల్ వార్తలు వినిపిస్తూ వచ్చాయి.

అయితే ఈ సినిమాని సీక్వెల్ కాకుండా రీమేక్ చేసే ఆలోచనలో నిర్మాత అశ్వనీదత్ వున్నాడనే వార్త ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. మెగా అభిమానుల కోరికమేరకు ఆయన ఈ సినిమా రీమేక్ ను చరణ్ తో చేయాలని అనుకుంటున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమా రీమేక్ ను రాజమౌళితో చేయాలని చూసిన అశ్వనీదత్, ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో మనసు మార్చుకున్నాడట. మరో దర్శకుడితో ఈ రీమేక్ ను పట్టాలెక్కించేందుకు అవసరమైన సన్నాహాలు చేస్తున్నాడని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.54.215
Movie News (Latest)