ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

70 కోట్ల క్లబ్ లో 'జనతా గ్యారేజ్'

Mon, Sep 12, 2016
'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్ - నిత్యా మీనన్
'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్ - నిత్యా మీనన్
ఎన్టీఆర్ అభిమానులు ఆశించినట్టుగానే 'జనతా గ్యారేజ్' సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు, యుఎస్ లోను ఈ సినిమా తన సత్తా చాటుతోంది. ఈ నెల 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, పది రోజులు పూర్తయ్యేనాటికి 70 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.

ఇక యుఎస్ లో 1.7 మిలియన్ డాలర్లను అంటే 11.42 కోట్లను వసూలు చేసింది. త్వరలో ఈ సినిమా 2 మిలియన్ మార్క్ ను చేరుకోవడం ఖాయమనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ కెరియర్ లో ఈ స్థాయి వసూళ్లు ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. కథ కథనాలు .. చిత్రీకరణ .. నటీనటుల నటన ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా ఇంతటి ఘన విజయాన్ని సాధించడం పట్ల, ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.87.119.171
Movie News (Latest)