ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'పంచ'పాత్రలలో చెన్నయ్ బ్యూటీ

Mon, Sep 12, 2016
త్రిష
త్రిష
చెన్నయ్ బ్యూటీ త్రిష జోరు పెంచేసింది. పరిశ్రమకు వచ్చి ఇన్నేళ్లయినా కూడా ఈ ముద్దుగుమ్మ ఇంకా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగానే కొనసాగుతోంది. ప్రస్తుతం మోహిని చిత్రంతో పాటు మరో హారర్ చిత్రానికి కూడా ఓకే చెప్పిన త్రిష, తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో త్రిష ఏకంగా ఐదు పాత్రలు పోషిస్తుందట. ఈ ఐదూ వైవిధ్యంతో సాగుతాయనీ, ఇందులో రెండు పాత్రల్లో మరింత నాజూగ్గా కనిపిస్తుందని అంటున్నారు. ఇందుకోసం బరువు తగ్గించుకునే పనిలో కూడా పడిందట. ఇళవరసన్ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇక ఇందులో నటించడానికి త్రిష ఏకంగా కోటి రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం.
X

Feedback Form

Your IP address: 54.163.166.22
Movie News (Latest)