ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆ విధంగా రజనీతో నటించే ఛాన్స్ వస్తుందట!

Sun, Sep 11, 2016
నవాజుద్దీన్ సిద్ధికి
నవాజుద్దీన్ సిద్ధికి
రజనీకాంత్ సరసన హీరోయిన్ గా నటించాలనుందా? అయితే, ముందుగా నాతో నటించండి ...అంటున్నాడు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి. వినడానికి ఆశ్చర్యంగానే వున్నప్పటికీ, అతను దీనికి చిన్న లాజిక్ కూడా చెప్పాడు. "నాతో నటిస్తే ఆ తర్వాత రజనీకాంత్ ఆటోమేటిక్ గా ఆ హీరోయిన్ కి తన సినిమాలో ఛాన్స్ ఇస్తాడు. ఆమధ్య 'మాంజీ' సినిమాలో నా పక్కన కథానాయికగా నటించిన రాధికా ఆప్టేకు.. రజనీ తన 'కబాలీ' సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. తర్వాత 'ఫ్రీకీ అలీ' సినిమాలో నాతో నటించిన ఏమీ జాక్సన్ కు రజనీ తన 'రోబో' సీక్వెల్ లో ఛాన్స్ ఇచ్చారు. ఆ విధంగా నాతో నటించిన ఇద్దరు హీరోయిన్లు రజనీ సరసన నటించే లక్కీ ఛాన్స్ కొట్టేశారు. చూసుకోండి మరి, మన సెంటిమెంట్ బాగా పనిచేస్తుంది" అంటూ హీరోయిన్లను కవ్విస్తున్నాడు నవాజుద్దీన్.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)