ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మరో హారర్ థ్రిల్లర్ కి త్రిష గ్రీన్ సిగ్నల్

Sun, Sep 11, 2016
త్రిష
త్రిష
తెలుగు .. తమిళ .. కన్నడ భాషల్లో హారర్ చిత్రాలు వసూళ్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ తరహా సినిమాలను తెరకెక్కించడానికి దర్శక నిర్మాతలు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ తరహా సినిమాలు భారీ విజయాలను సాధిస్తూ ఉండటంతో, అగ్ర కథానాయికలు సైతం ఈ సినిమాల్లో నటించడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.

అలాంటి కథానాయికలలో నయనతార తరువాత స్థానాన్ని చేరుకోవడానికి త్రిష ప్రయత్నిస్తోంది. 'నాయకి' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయిన త్రిష, 'మోహిని'తో సక్సెస్ ను సాధించాలని భావిస్తోంది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ, విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇదే సమయంలో మరో హారర్ మూవీ చేయడానికి త్రిష అంగీకరించిందనీ, ఇది ఒక హాలీవుడ్ మూవీకి రీమేక్ అని అంటున్నారు. నిర్మాత పంపించిన డీవీడీ చూసి వెంటనే త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇందులో త్రిష ద్విపాత్రాభినయం చేయనుండటం విశేషం.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)