ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సంక్రాంతికి రాకపోవచ్చన్న నాగ్

Sun, Sep 11, 2016
నాగార్జున ప్రధాన పాత్ర ధారిగా 'ఓం నమో వెంకటేశాయ' చిత్రం రూపొందుతోంది. 'హథీ రామ్ బావాజీ' జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమాను రాఘవేంద్రరావు తెరకెక్కిస్తున్నారు. అనుష్క .. ప్రగ్యా జైస్వాల్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. మహేశ్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాను గురించి తాజాగా నాగార్జున మాట్లాడారు.

ఇప్పటివరకూ ఈ సినిమా 50 శాతానికి పైగా చిత్రీకరణను పూర్తి చేసుకుందని ఆయన అన్నారు. అక్టోబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ పార్టు పూర్తవుతుందనీ, ఆ తరువాత నుంచి విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన పనులు మొదలవుతాయని చెప్పారు. విజువల్ ఎఫెక్ట్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసి ఉందనీ, అందుకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని అన్నారు. ఈ కారణంగా ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉండకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
X

Feedback Form

Your IP address: 54.163.166.22
Movie News (Latest)