ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హీరోయిన్లను ఊరిస్తున్న ఐటెం పాటలు!

Sun, Sep 11, 2016
కాజల్ అగర్వాల్
కాజల్ అగర్వాల్
గతంలో హీరోయిన్లు ఐటెం పాటలు చేసేవారు కాదు. అలాంటివి చేయడాన్ని నామోషీగా ఫీలయ్యేవారు. అందుకే, అప్పట్లో అలాంటి పాటలు చేయడానికి ప్రత్యేకంగా ఐటెం భామలు వుండేవారు. అయితే, గత కొంతకాలంగా పరిస్థితి మారిపోయింది. టాప్ హీరోయిన్లతోనే ఐటెం పాటలు చేయించడం నయా ట్రెండ్ అయింది. పెద్ద మొత్తంలో పారితోషికం ఆఫర్ చేయడంతో సిగ్గూ ఎగ్గులను పక్కన పెట్టేసి, మన హీరోయిన్లు ఆ పాటలు చేయడానికి ముందుకు వస్తున్నారు. పైగా, హీరోయిన్లతోనే ఈ పాటలని చేయించడం వల్ల చిత్రానికి కూడా అదనంగా క్రేజ్ వస్తోంది. అందుకే, దర్శక నిర్మాతలు కూడా ఐటెం పాటలకు బాగా ఖర్చు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఇటీవల కాజల్ అగర్వాల్ 'జనతా గ్యారేజ్' సినిమాలో ఐటెం పాట చేసినందుకు 50 లక్షల వరకు తీసుకున్నట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడు 'జాగ్వార్' అనే సినిమాలో అలాంటి సాంగు చేయడానికి తమన్నా కోటి రూపాయలు డిమాండ్ చేసి, చివరికి 75 లక్షలకు ఫిక్స్ అయినట్టు సమాచారం. ఇక త్వరలో 'ఖైదీ నంబర్ 150' సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో ఐటెం సాంగ్ చేయడానికి కేథరిన్ త్రెసాకు కూడా బాగానే ముడుతున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కేవలం నాలుగు రోజుల షూటింగుకే (పాట చిత్రీకరణ సమయం) ఇన్నేసి లక్షలు వస్తుండడంతో మిగతా టాప్ హీరోయిన్లు సైతం ఇలాంటి పాటలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. వరస చూస్తుంటే, కొన్నాళ్లకి ప్రతి సినిమాకు ఓ టాప్ హీరోయిన్ తో ఇలాంటి ఐటెం పాట ఒకటి 'ఫార్ములా' అయిపోయినా అవ్వచ్చు!
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)