ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Sun, Sep 11, 2016
తమన్నా
తమన్నా
* మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా ప్రస్తుతం జార్జియా దేశంలో విహరిస్తోంది. విశాల్ హీరోగా రూపొందుతున్న 'కత్తిసండై' అనే తమిళ చిత్రంలో ఈ చిన్నది కథానాయికగా నటిస్తోంది. ఇందుకు సంబంధించిన పాటలను ప్రస్తుతం వీరిద్దరిపైనా జార్జియాలో చిత్రీకరిస్తున్నారు.
* స్వీయ దర్శకత్వంలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తాను ప్రధాన పాత్ర పోషిస్తూ నిర్మించిన 'మన ఊరి రామాయణం' చిత్రం ఆడియోను అమెరికాలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర సంగీత దర్శకుడు ఇళయరాజా అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడే ఒక కాన్సర్ట్ లో ఈ ఆడియోను రిలీజ్ చేస్తారట.
* రామ్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'హైపర్' చిత్రం పాటల చిత్రీకరణ జార్జియాలో పూర్తయింది. పది రోజుల పాటు అక్కడి అందమైన లోకేషన్లలో ఈ పాటలను చిత్రీకరించారు. వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తిచేసి ఈ నెల 30 న చిత్రాన్ని రిలీజ్ చేస్తామని నిర్మాత చెప్పారు. ఇందులో రాశిఖన్నా కథానాయికగా నటించగా, తమిళ నటుడు సత్యరాజ్ కీలక పాత్ర పోషించాడు.
X

Feedback Form

Your IP address: 184.73.107.18
Movie News (Latest)