ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ప్రభుదేవా హెల్ప్ చేశాడంటున్న తమన్నా

Sat, Sep 10, 2016
తమన్నా
తమన్నా
తమన్నా ప్రధాన పాత్ర ధారిగా ఒక త్రిభాషా చిత్రం రూపొందుతోంది. తమిళంలో 'డెవిల్' .. హిందీలో 'తుటక్ తుటక్ తుటియా' .. తెలుగులో 'అభినేత్రి'అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, ప్రభుదేవా .. సోను సూద్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.

ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసే ఛాన్స్ లభించడం తన అదృష్టమని తమన్నా చెప్పింది. ప్రభుదేవా గొప్ప డాన్సర్ అనీ .. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ లభించడం తన అదృష్టమని అంది. ఈ సినిమాలో ఒక సాంగ్ లో చాలా క్లిష్ట తరమైన స్టెప్స్ వున్నాయనీ, ఆ స్టెప్స్ ను తాను తప్పుగా వేస్తుంటే .. అక్కడే వున్న ప్రభుదేవా సరిదిద్దాడని చెప్పింది. ఆయన సహాయ సహకారాలను మరిచిపోలేనని చెప్పుకొచ్చింది. మరి ఈ సినిమా తమన్నా ఆశిస్తున్నట్టుగా మూడు భాషల్లోను ఒకేసారి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.161.208.7
Movie News (Latest)