ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తమిళ డబ్బింగ్ కూడా మహేశ్ తోనే!

Sat, Sep 10, 2016
మహేశ్ బాబు
మహేశ్ బాబు
మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తెలుగు .. తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తెలుగు వెర్షన్ తో పాటు తమిళ వెర్షన్ కి కూడా మహేశ్ బాబుతో డబ్బింగ్ చెప్పించాలని మురుగదాస్ నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పాడు.

మహేశ్ బాబు చెన్నై లో పుట్టి పెరగడం వలన తమిళంలో బాగా మాట్లాడగలడు. అందువలన తమిళ వెర్షన్ లో ఆయన పాత్రకి ఆయనతోనే డబ్బింగ్ చెప్పించనున్నానని మురుగదాస్ అన్నాడు. మహేశ్ బాబు నటించిన 'శ్రీమంతుడు' .. 'బ్రహ్మోత్సవం' చిత్రాలు తమిళంలో రిలీజ్ అయినప్పుడు, అక్కడి డబ్బింగ్ ఆర్టిస్టులతో డబ్బింగ్ చెప్పించారు. ప్రత్యేకమైన ఆకర్షణ కోసం ఈసారి మహేశ్ బాబుతోనే డబ్బింగ్ చెప్పించనున్నారు. అక్కడి మహేశ్ ఫ్యాన్స్ కి ఇది ఒక రకమైన శుభవార్తే.
X

Feedback Form

Your IP address: 54.158.119.60
Movie News (Latest)