ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వక్కంతం మూవీ బన్నీకి కలిసొచ్చేనా?

Sat, Sep 10, 2016
అల్లు అర్జున్
అల్లు అర్జున్
ఒకవైపున చరణ్ .. మరో వైపున ఎన్టీఆర్ మాస్ మూవీలకి కాస్త దూరంగా వెళ్లి, క్లాస్ ఆడియన్స్ ను టచ్ చేసే కథలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఇదే సమయంలో యూత్ ఫుల్ స్టోరీస్ చేస్తూ వచ్చిన అల్లు అర్జున్, కొత్తదనం కోసం మాస్ కథలవైపు దృష్టి పెట్టాడు. అందులో భాగంగానే ఆయన చేసిన 'సరైనోడు' సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

మొదట ఈ కథ చరణ్ దగ్గరికి వెళ్లగా ఆయన పెద్దగా ఆసక్తిని చూపకపోవడంతో, బన్నీ దగ్గరికి వెళ్లగా ఆయన ఓకే చెప్పేశాడు. అలా ఆ సినిమాతో ఆయనకి ఘన విజయం దక్కింది. ఇప్పుడు అలాగే ఎమోషన్ కి పెద్దపీట వేస్తూ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలని వక్కంతం వంశీ అనుకున్నాడు. అయితే ఎన్టీఆర్ ఈ మాస్ కథకి పెద్దగా ఇంట్రెస్ట్ చూపకపోవడంతో, ఈ కథ కూడా బన్నీ దగ్గరికి వెళ్లి ఆయనతో ఓకే అనిపించుకుందని చెబుతున్నారు. మరి ఈ కథ కూడా బన్నీకి సక్సెస్ ను తెచ్చిపెడుతుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 23.23.50.247
Movie News (Latest)