ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ఇంకొక్కడు' భారీగానే వసూలు చేస్తున్నాడు

Sat, Sep 10, 2016
'ఇంకొక్కడు'లో విక్రమ్ - నయనతార
'ఇంకొక్కడు'లో విక్రమ్ - నయనతార
విక్రమ్ తన సినిమాలు ప్రయోగాత్మకంగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. విభిన్నమైన గెటప్స్ తో కనిపించడానికి ఆసక్తిని చూపిస్తుంటాడు. అందువల్లనే కథా .. కథనాల సంగతి ఎలా వున్నా ఆయన పాత్రల్లోని కొత్తదనాన్ని చూడటానికి భారీ సంఖ్యలో అభిమానులు థియేటర్స్ కి వెళుతుంటారు.

అలాగే 'ఇంకొక్కడు' సినిమా కూడా ప్రేక్షకులను థియేటర్స్ కి బాగా రప్పిస్తోందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో విక్రమ్ హీరోగానూ .. విలన్ గాను డిఫరెంట్ లుక్స్ తో కనిపించడం ప్రధానమైన ఆకర్షణగా మారింది. అందువలన ఈ సినిమా తొలి రోజున 5 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ వీకెండ్ పూర్తయ్యేనాటికి ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. 'జ్యో అచ్యుతానంద' పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా, 'ఇంకొక్కడు' వసూళ్లు తగ్గకపోవడం విశేషం.
X

Feedback Form

Your IP address: 54.161.209.240
Movie News (Latest)