ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వరుస సినిమాలు చేస్తానంటున్న సీనియర్ హీరో

Sat, Sep 10, 2016
శరత్ కుమార్
శరత్ కుమార్
ఒకప్పుడు మాస్ ఆడియన్స్ ను తనదైన శైలిలో మెప్పించిన కోలీవుడ్ కథానాయకుడు శరత్ కుమార్. అనువాద చిత్రాల ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కొన్ని తెలుగు సినిమాల్లోను ఆయన నెగిటివ్ రోల్స్ ను పోషించారు. అలాంటి శరత్ కుమార్ ఆ తరువాత రాజకీయాల పట్ల ఎక్కువ ఆసక్తిని చూపించారు. అలా ఆ మార్గంలో ప్రయాణిస్తూ వెళ్లిన ఆయన, తాజాగా మనసు మార్చుకున్నారు.

ఇకపై నటనకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాననీ, వరుస సినిమాలు చేస్తానని చెప్పారు. ప్రస్తుతం ఒక తమిళ చిత్రంలోను .. కన్నడ మూవీలోను చేస్తున్నానని అన్నారు. ఈ రెండు సినిమాలలోను తన పాత్రకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుందనీ, ఇకపై ఈ తరహా పాత్రలను చేయాలనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన తెలుగు తెరపై కనిపించే అవకాశాలు కూడా ఎక్కువగానే వున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)