ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేశ్ చిత్రానికి ఖర్చు అప్పుడే తేలదట!

Sat, Sep 10, 2016
మహేశ్ బాబు
మహేశ్ బాబు
ఇప్పుడు తెలుగు, తమిళ చిత్ర సీమల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న చిత్రం ఏమిటంటే, మహేశ్ బాబు- మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రమే అని చెప్పాలి. ఎప్పటి నుంచో అనుకుంటున్న ఈ కాంబినేషన్ ఇన్నాళ్లకు సెట్ అవడం, ఇద్దరూ ఎవరికి వారు ఉద్దండులు కావడంతో ఈ చిత్రానికి ఎంతో క్రేజ్ వచ్చింది. పైపెచ్చు, దీనిని 100 కోట్ల భారీ బడ్జెట్టుతో నిర్మిస్తున్నారన్న ప్రచారం మరింత క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో, ఈ బడ్జెట్టు నిజమేనా? అని దర్శకుడు మురుగదాస్ ను తాజాగా అడిగితే, ఆయన స్ట్రెయిట్ గా సమాధానం చెప్పలేదు.

"షూటింగ్ ఇప్పుడే కదా మొదలెట్టాం. అప్పుడే ఖర్చు ఎంత అవుతుందంటే ఎలా చెప్పగలం. చివరికొచ్చాక బడ్జెట్టు ఏమిటనేది తేలుతుంది. ఆ లెక్కలన్నీ ఆఖరులోనే తేలతాయి" అన్నాడు నవ్వుతూ. మామూలుగా ఎవరైనా ఒక బడ్జెట్టు వేసుకునే సినిమా మొదలెడతారు. దానికి కాస్త అటు ఇటుగా లెక్కతేలుతుంది. మరి, మురుగదాస్ మాటలను బట్టి చూస్తే, బడ్జెట్టు లేకుండానే చిత్రాన్ని నిర్మిస్తున్నారనుకోవాలా? లేక 100 కోట్లు దాటేస్తుందనుకోవాలా?
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)