ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆనందాన్ని వ్యక్తం చేసిన సంపత్ నంది

Fri, Sep 09, 2016
సంపత్ నంది
సంపత్ నంది
యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథాంశాలను ఎంచుకుంటూ సంపత్ నంది సక్సెస్ లను సాధిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన తదుపరి సినిమాకు సంబంధించిన పనిలో బిజీగా వున్నాడు. గోపీచంద్ కథానాయకుడిగా సంపత్ నంది ఒక సినిమాను తెరకెక్కించనున్నాడు. భగవాన్ - పుల్లారావు నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో హన్సిక కథానాయికగా అలరించనుంది.

ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మ్యూజిక్ సిటింగ్స్ మొదలైనట్టుగా సంపత్ నంది ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. తనకి తమన్ అంటే ఎంతో ఇష్టమనీ .. ఆయనతో కలిసి పనిచేయడం తనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని అన్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా, గోపీచంద్ అభిమానుల అంచనాలకి తగినట్టుగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చాడు.
X

Feedback Form

Your IP address: 184.73.107.18
Movie News (Latest)