ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అలాంటిదేం లేదన్న నాగ్

Fri, Sep 09, 2016
నాగార్జున
నాగార్జున
'బాహుబలి 2' సినిమా కృష్ణా జిల్లా హక్కులను సాయి కొర్రపాటితో కలిసి నాగార్జున 8 కోట్లకి కొనుగోలు చేసినట్టుగా రెండు రోజుల నుంచి వార్తలు షికారు చేస్తున్నాయి. 'నిర్మలా కాన్వెంట్' సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా వున్న నాగార్జునకి, ఈ విషయాన్ని గురించిన ప్రశ్న ఎదురైంది. అందుకు ఆయన తనదైన శైలిలో స్పందించారు.

డిస్ట్రిబ్యూషన్ ఆలోచనలు తనకి లేవని నాగార్జున చెప్పారు. కొన్ని పుకార్లు ఎలా పుడతాయో తెలియదనీ .. ఇది కూడా అలాంటి పుకారేనని ఆయన అన్నారు. ఇలాంటి ప్రచారాలు నమ్మవద్దని ఆయన చెప్పారు. ఇక 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమం నుంచి తాను బ్రేక్ తీసుకున్నాననీ, తన స్థానంలో చిరంజీవి వస్తుండటం నిజమేనని ఆయన అన్నారు. చిరంజీవి రాక వలన ఈ కార్యక్రమం రేంజ్ మరింత పెరుగుతుందని చెప్పారు.
X

Feedback Form

Your IP address: 54.205.54.215
Movie News (Latest)