ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కేరళలో నిరాశ పరచిన 'గ్యారేజ్'

Fri, Sep 09, 2016
'జనతా గ్యారేజ్'లో మోహన్ లాల్ - ఎన్టీఆర్
'జనతా గ్యారేజ్'లో మోహన్ లాల్ - ఎన్టీఆర్
కొరటాల శివ దర్శకత్వం వహించిన 'జనతా గ్యారేజ్' .. తెలుగుతో పాటు మలయాళంలోను భారీస్థాయిలో విడుదలైంది. మలయాళంలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశంతోనే, మోహన్ లాల్ తో పాటు మరికొన్ని ముఖ్యమైన పాత్రలకి మలయాళ నటీనటులను తీసుకున్నారు.

తెలుగులో ఈ సినిమా తొలి రోజున మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తొలివారంలోనే ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ ను రాబట్టింది. ఇక మలయాళం వెర్షన్ కి వచ్చేసరికి అక్కడి ఫలితం పూర్తిగా నిరాశపరుస్తోంది. తొలివారానికి ఈ సినిమా అక్కడ 3.22 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. రెండవ వారంలో వసూళ్లు మరింత తగ్గాయి. మలయాళం వెర్షన్ ఫలితం విషయంలో అంచనాలు తప్పడం ఈ సినిమా టీమ్ కి అసంతృప్తిని కలిగించే అంశమేనని చెప్పొచ్చు.
X

Feedback Form

Your IP address: 54.204.247.205
Movie News (Latest)