ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చరణ్ తో తలపడుతోన్న విలన్

Fri, Sep 09, 2016
అరవింద్ స్వామి
అరవింద్ స్వామి
చరణ్ కథానాయకుడిగా 'ధ్రువ' చిత్రం రూపొందుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, అరవింద్ స్వామి విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలావరకూ జరిగింది. అయితే ఇటీవల అరవిందస్వామి అనారోగ్యానికి గురికావడం వలన, షూటింగ్ విషయంలో జాప్యం జరిగింది.

ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో అరవింద్ స్వామి జాయిన్ అయ్యాడు. చరణ్ .. అరవింద్ స్వామికి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు ఆడియన్స్ తో విజిల్స్ వేయించేలా వుంటాయని చెబుతున్నారు. రకుల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయనున్నారు.
X

Feedback Form

Your IP address: 184.73.107.18
Movie News (Latest)