ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అక్టోబర్ లో వస్తోన్న శ్రీశాంత్ మూవీ

Fri, Sep 09, 2016
'టీమ్ 5'లో నిక్కీ గల్రాని - శ్రీశాంత్
'టీమ్ 5'లో నిక్కీ గల్రాని - శ్రీశాంత్
సూపర్ ఫాస్ట్ బౌలర్ గా గతంలో క్రికెట్ అభిమానులను అలరించిన శ్రీశాంత్, త్వరలో వెండితెరపై కనిపించనున్నాడు. ఆయన కథానాయకుడిగా సురేష్ గోవింద్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. 'టీమ్ 5' అనే టైటిల్ ను ఈ సినిమాకి ఖరారు చేశారు. అయిదుగురు స్నేహితుల జీవితాల్లో చోటుచేసుకునే కొన్ని సంఘటనల సమాహారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో శ్రీశాంత్ చాలా స్టైలిష్ గా కనిపించనున్నాడు. గోపీసుందర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో నిక్కీ గల్రాని కథానాయికగా అలరించనుంది. అక్టోబర్ లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. తెలుగు .. తమిళ .. కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. శ్రీశాంత్ ఆశించినట్టుగా ఈ సినిమా ఆయన కెరియర్ స్పీడ్ పెంచుతుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 23.23.50.247
Movie News (Latest)