ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేశ్ తో మణిరత్నం మూవీ ఆగింది అందుకే!

Fri, Sep 09, 2016
మహేశ్ బాబు
మహేశ్ బాబు
కొంతకాలం క్రితం మణిరత్నం తెలుగు .. తమిళ భాషల్లో ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నారు. మహేశ్ బాబు .. విజయ్ .. విశాల్ .. అనుష్క ప్రధాన తారాగణంగా ఈ సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేసుకున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలెట్టేశారు. అయితే అనుకోకుండా ఈ సినిమా ఆ దశలోనే ఆగిపోయింది.

ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రచయితగా పనిచేసిన జయమోహన్ .. తాజాగా అందుకు గల కారణాన్ని చెప్పారు. కథాపరంగా ఈ సినిమాను కొన్ని దేవాలయాలలో చిత్రీకరించవలసి ఉందట. అయితే తమిళనాడులో తాము అనుకున్న దేవాలయాల నుంచి అనుమతి రాలేదని ఆయన చెప్పారు. ఆయా దేవాలయాలను సెట్ వేయాలని చూస్తే, అదనంగా 50 కోట్ల రూపాయల ఖర్చు వస్తోందట. అందువలన ఈ సినిమాను ఆపేయవలసి వచ్చిందని చెప్పుకొచ్చాడు.
X

Feedback Form

Your IP address: 54.147.212.136
Movie News (Latest)