ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నిర్మాతగా మారనున్న త్రివిక్రమ్?

Fri, Sep 09, 2016
త్రివిక్రమ్
త్రివిక్రమ్
రచయితగా .. దర్శకుడిగా త్రివిక్రమ్ తనదైన శైలితో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. త్వరలో ఆయన నిర్మాతగా కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకుంటున్నారు. అయితే ఆయన నిర్మాతగా మారేది తాను తెరకెక్కించే సినిమా కోసం కాదట. మరొకరి దర్శకత్వంలో రూపొందే సినిమా కోసం అనే టాక్ వినిపిస్తోంది.

అలా మొదలైంది .. కల్యాణ వైభోగమే వంటి సినిమాలతో దర్శకురాలిగా తన ప్రతిభా పాటవాలను నందినీ రెడ్డి నిరూపించుకుంది. యూత్ ను దృష్టిలో పెట్టుకుని ఆమె మరో సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. వచ్చే ఏడాది ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లనుందని అంటున్నారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడని అనుకుంటున్నారు. ఈ విషయంలో నిజమెంతనేది తెలియాల్సి వుంది.
X

Feedback Form

Your IP address: 54.204.130.177
Movie News (Latest)